
గెడ్డ వాగుపై వంతెన నిర్మించి రోడ్లు వేయాలని అర్ధనగ్నంగా నిరసన
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని శంకరం పంచాయతీ పరిధిలో తాడివలస, కొత్తవలస మధ్య గెడ్డ వాగుపై వంతెన నిర్మించి రోడ్లు వేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. రోడ్లు వేస్తే తమ కష్టాలు తీరుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, అర్ధనగ్నంగా ఉరితాళ్లతో నిరసన తెలిపారు.






























