
విశాఖ: పార్టీ మారగానే బీఫామ్
జీవీఎంసీ ఎన్నికల వేళ విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. బీజేపీ నేత, 95వ వార్డు మాజీ కార్పొరేటర్ ముమ్మన దేముడు తిరిగి వైసీపీ గూటికి చేరారు. పార్టీ కండువా కప్పుకున్న కొద్దిసేపటికే ఆయనకు 115వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా వైసీపీ బీఫామ్ అందింది. గతంలో వైసీపీ తరఫున 95వ వార్డు నుంచి గెలిచిన దేముడు, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ సొంత పార్టీకి రావడంతో పాటు వెంటనే టికెట్ దక్కడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.






























