
ఈతకు వెళ్లి యువకుడు మృతి
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. దుర్గానగర్‌కు చెందిన సత్యసాయి ప్రకాశ్ (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి తాండవ చక్కెర కర్మాగారం సమీపంలోని పోలవరం ఎడమ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. స్థానికులు, బంధువులు అతడిని బయటకు తీసి సిపిఆర్ చేసి తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
























