
చిన్నగెద్దాడలో ఐదు మద్యం బాటిళ్లు స్వాధీనం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంపచోడవరం మండలంలో గురువారం ఎక్సజ్ పోలీసులు తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నగెద్దాడ గ్రామంలో అక్రమ మద్యం గుర్తించి, ఐదు డీపీఎల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని సి. ఐ. శ్రీధర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అయన వెల్లడించారు. ఈసందర్బంగా వాహన తనిఖీలను నిర్వహించారు.


























