పశ్చిమ విశాఖ - West Vizag

18న వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ దసరా సంబరాలు

18న వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ దసరా సంబరాలు

ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ అసోసియేషన్, స్మాల్ & మీడియం వార్త దినపత్రికల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఆదివారం విశాఖపట్నంలో వర్కింగ్ జర్నలిస్టుల దసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఆర్గనైజర్ సెక్రటరీ రవికుమార్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, విశాఖ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, సభ్యులు పాల్గొంటారు.

వీడియోలు


హైదరాబాద్
విదేశీ బొగ్గు దిగుమతిలో రూ.3 వేల కోట్ల స్కాం: KTR
Oct 15, 2026, 11:10 IST/

విదేశీ బొగ్గు దిగుమతిలో రూ.3 వేల కోట్ల స్కాం: KTR

Oct 15, 2026, 11:10 IST
TG: సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రాశారు. రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్‌ ఆపాలని డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో భారీ స్కామ్‌ జరుగుతోందని ఆరోపించారు. 'భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే CM చీకటి ఒప్పందం. కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి కంపెనీని రేవంత్‌రెడ్డి రంగంలోకి దింపారు. భోత్రా లాజిస్టిక్స్‌తో ప్రభుత్వం, సింగరేణి ఒప్పందం బయటపెట్టాలి. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలపై చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు' అని అన్నారు.