
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ను తొలగించాలీ..సీఐటీయూ
పరవాడ సంత వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన నిరసనలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. SIR పేరుతో ఓటర్ల పేర్ల తొలగింపును, ఢిల్లీలో నిరసనకారుల అరెస్టులు, లాఠీచార్జిని ఖండించారు. అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించి, ఓటు హక్కును కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.





























