AP: రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి తీసుకున్న అప్పుల వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.194.33 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలు అబద్ధాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 2026-27 బడ్జెట్లో రూ.836.26 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.421.99 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానా నుండి ఈ నిధులను విడుదల చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.