అంబటి ‘రాయల్ సెల్యూట్’.. కూటమి సెటైర్లు!

21చూసినవారు
అంబటి ‘రాయల్ సెల్యూట్’.. కూటమి సెటైర్లు!
AP: మద్యం రవాణా టెండర్ల కేసుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అంబటి స్పందిస్తూ.. తనకు లిక్కర్‌తో ఉన్న సంబంధం ఒకటేనని, తాను ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి 90 ఎంఎల్ రాయల్ సెల్యూట్ తాగుతానని చెప్పారు. దీనిపై కూటమి నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. రాయల్ సెల్యూట్ ఖరీదైన బ్రాండ్ విస్కీ.. దీని ధర రూ.20 వేలకుపైనే ఉంటుంది. అంబటి రాంబాబు, వైసీపీ ఓడిపోవడం వల్లే ఆ బ్రాండ్ ఏపీలో దొరుకుతోందని, లేకపోతే ప్రెసిడెన్షియల్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చేదని కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్