
కోటవురట్ల ఎంపీటీసీ అభ్యర్థిగా పెంటకోట లక్ష్మీ పార్వతి నామినేషన్
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం ఎంపీటీసీ-2 వైసీపీ అభ్యర్థిగా పెంటకోట లక్ష్మీ పార్వతి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు, మాజీ సర్పంచ్ అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ రాంబాబుల సమక్షంలో ఆమె భారీ ర్యాలీగా వెళ్లి పత్రాలను సమర్పించారు. కార్యకర్తల అభీష్టం మేరకు తనను అభ్యర్థిగా ఎంపిక చేశారని, తనను గెలిపించాలని కోటవురట్ల సెగ్మెంట్-2 ఓటర్లను ఆమె కోరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



































