పరవాడ మండలంలోని వెన్నెలపాలెం, పరవాడ గ్రామాల్లో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు, ప్రజలు పాటించాల్సిన ఎన్నికల నియమ నిబంధనలు, సూచనలను ఫ్రీ రికార్డెడ్ స్లోగన్స్ ద్వారా ప్రజలకు వినిపిస్తూ అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం, భరణికం గ్రామంలో సాయంత్రం ఎన్నికల అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.