జడ్పిటిసి అభ్యర్థి

2చూసినవారు
జడ్పిటిసి అభ్యర్థి
పాయకరావుపేట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి యాళ్ళ జ్యోతి తన నామినేషన్ పత్రాలను అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్డీఏ అభ్యర్థిగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, జ్యోతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్