బీజేపీ తీర్థం పుచ్చుకున్న విశ్రాంత వీఆర్వో

2చూసినవారు
బీజేపీ తీర్థం పుచ్చుకున్న విశ్రాంత వీఆర్వో
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన విశ్రాంత వీఆర్వో శిరిసోళ్ల వెంకటరావు బీజేపీలో చేరారు. కూటమి ఎంపీపీ అభ్యర్థి గేదెల సత్యనారాయణ సమక్షంలో బీజేపీ నేత ఈర్లే శ్రీరామమూర్తి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల వేళ జరిగిన ఈ చేరికతో పొట్టిదొరపాలెంలో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తమరాన దాసు, కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్