
జంపపాలెంలో శాంతిభద్రతలపై అవగాహన
అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి, శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ క్రైమ్ వంటి నేరాలపై అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేంద్రతో పాటు గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



























