అనంతపురం జిల్లా - Ananthapur

నంద్యాల జిల్లాలో 70 అంగన్‌వాడీ ఉద్యోగాలు

నంద్యాల జిల్లాలో 70 అంగన్‌వాడీ ఉద్యోగాలు

AP: నంద్యాల జిల్లాలో స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం 6 ఐసిడియస్ ప్రాజెక్ట్‌లలో 70 అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ నెల 18 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణత, 21-35 ఏళ్ల వయసు, వివాహిత, స్థానిక నివాసం అర్హతలుగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుతో పాటు వయసు, కుల, విద్యార్హత, నివాస, ఆధార్, రేషన్ కార్డు ధ్రువపత్రాలు జత చేయాలి.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్