
సుదీర్ఘకాలంగా విధులకు దూరం.. ఎస్జీటీని సర్వీస్ నుంచి తొలగించిన అధికారులు
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం దోసలేడు పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న రాజా రమేష్ను జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుసేన్ సర్వీస్ నుంచి తొలగించారు. 2024 నుంచి అధికారులకు సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు గైర్హాజరవుతున్నారని, బహిరంగ ప్రకటనలు ఇచ్చినా స్పందించలేదని, నివేదిక అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు అయూబ్ హుసేన్ శనివారం తెలిపారు. ఈ సంఘటన విద్యావ్యవస్థలో క్రమశిక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది.































