Sep 28, 2026, 17:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
గ్రామ పంచాయతీకి రూ.50 వేల ట్యాబ్ విరాళం
Sep 28, 2026, 17:09 IST
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో బాన్సువాడ మండలం హంగర్గా గ్రామ పంచాయతీ అవసరాల కోసం సుభాష్ గుప్తా రూ. 50 వేల విలువైన ట్యాబ్ను విరాళంగా సోమవారం అందజేశారు. హైదరాబాద్లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన, గత 20 ఏళ్లుగా అంధుల కోసం సొంతంగా ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉదయ్ భాస్కర్, గ్రామాభివృద్ధికి అందిస్తున్న సహకారానికి సుభాష్ గుప్తాకు గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.