
పోలియో, అతిసార నివారణపై ఉద్దేహాల్లో అవగాహన కార్యక్రమం
బొమ్మనహల్ మండలంలోని ఉద్దేహాల్ గ్రామంలో గురువారం పోతప్ప గుడి వీధిలో అతిసార, మలేరియా నివారణ, పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం జరిగింది. స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు పాటించాలని సూచించారు. జూన్ 28న జరిగే కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.












