
దళితులపై దాడులు పెరిగాయి: రాంప్రసాద్ విమర్శ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి మాల్యవంతం రాంప్రసాద్ విమర్శించారు. శనివారం మాల్యావంతం గ్రామంలో పోస్టర్ విడుదల చేసిన ఆయన, 27 మంది దళితుల హత్యలకు న్యాయం కోరుతూ ఈ నెల 28న ఉదయం 10 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ భవన్ వద్ద నిర్వహించే బీఎస్పీ నిరసన ధర్నాకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.






























