Sep 25, 2026, 17:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
కామారెడ్డిలో 27న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణ
Sep 25, 2026, 17:09 IST
కామారెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓరియంటల్ హైస్కూల్లో ఈ శిబిరం జరగనుంది. సింధు హాస్పిటల్స్, మాదాపూర్ సహకారంతో, లయన్ రామదేవి రెడ్డి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శిబిరంలో వైద్యుల సంప్రదింపులతో పాటు బీపీ, షుగర్, బరువు, ఆక్సిజన్ స్థాయి, పల్స్ వంటి ప్రాథమిక పరీక్షలు, ఎక్స్రే, మహిళలకు మ్యామోగ్రఫీ, పాప్స్మియర్, బ్రెస్ట్ స్క్రీనింగ్ వంటి ఉచిత సేవలు అందించనున్నారు.