
గుత్తిలో మొహర్రం వేడుకలు: అగ్నిగుండ ప్రవేశం, స్వల్ప ఘర్షణ
మొహర్రం సందర్భంగా బుధవారం రాత్రి గుత్తిలో చిన్న సరిగెత్తు వేడుకలు ఘనంగా జరిగాయి. పగ్గాల పీర్ల స్వాములు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. అయితే, పీర్ల ఊరేగింపు సమయంలో భక్తుల మధ్య మాట మాట పెరిగి స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పీర్ల చావడీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొహర్రం వేడుకలను తిలకించారు.
















