Sep 05, 2026, 16:09 IST/
విద్యుత్ షాక్ తగిలి మూడేళ్ల బాలుడు మృతి
Sep 05, 2026, 16:09 IST
TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్కు చెందిన బానోతు సంపత్ కుమారుడు రిషి (3) నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఎర్త్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.