Sep 26, 2026, 01:09 IST/
ఏషియన్ గేమ్స్: మారథాన్ లో 44 ఏళ్ల తర్వాత మెడల్
Sep 26, 2026, 01:09 IST
ఏషియన్ గేమ్స్ లో భారత మారథాన్ రన్నర్ సావన్ బర్వాల్ సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. 42.195 కిలోమీటర్ల రేసును 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తిచేసి, 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ కు ఈ విభాగంలో పతకాన్ని అందించారు. ఈ టైమింగ్ ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. చివరిసారిగా 1982లో హోసూర్ కుక్కప్ప సీతారాన్ ఈ విభాగంలో కాంస్య పతకం సాధించారు.