
దోసలుడికి జెడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికలు
గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మునూరు జయరాం ఆదేశాల మేరకు, గుంతకల్లు మండల ఇంచార్జ్ గుమ్మునూరు నారాయణ స్వామి సూచనలతో దోసలుడికి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అగ్రహారం నాగేష్ SMC కమిటీ చైర్మన్గా, జీలకర శశికళ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి బండారి పురుషోత్తం, 10వ తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు ప్రకటించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా గ్రామ విద్యాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.




























