
వైసీపీకి మరో షాక్..హిందూపురం మాజీ అధ్యక్షుడు రాజీనామా
శ్రీసత్యసాయి జిల్లా, పెనుగొండ, హిందూపురం ప్రాంతాలలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, హిందూపురం వైసీపీ మాజీ అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్ నిశ్చల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం వైసీపీ అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ఏడాది క్రితం నవీన్ నిశ్చల్పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది, అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. నవీన్ నిశ్చల్ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది.

























