
అప్పుల బాధతో ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో అప్పుల బాధతో రైతు గోవిందు (38) ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు ఎకరాలలో టమాటా పంట సాగు చేసిన గోవిందు, పంట చేతికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రూ.55 లక్షల వరకు అప్పులు ఉండడంతో గ్రామ సమీపంలోని రైల్వే గేట్ వద్ద చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.



























