
మొహర్రం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్ఐ లోకేశ్ కుమార్
కంబదూరు పరిధిలోని గ్రామాల్లో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ లోకేశ్ కుమార్ సూచించారు. గురువారం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని, పచ్చని చెట్లను నరికి గుండంలో వేయరాదని స్పష్టం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.















