Sep 16, 2026, 11:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ ధర్మతేజ
Sep 16, 2026, 11:09 IST
కామారెడ్డి జిల్లా, బాన్సువాడలోని బీర్కూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ అరిగే ధర్మతేజ మధ్యాహ్న భోజనాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వంటగది పరిశుభ్రతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.