
పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని విద్యార్థుల డిమాండ్
శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర మండలం జమ్మలబండ జడ్పీ హైస్కూల్ సమీపంలో వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. స్కూల్ రహదారి పక్కనే ఉండటంతో ప్రమాదాల భయం నెలకొంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, అధికారులు స్పందించి స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




























