Oct 12, 2026, 11:10 IST/
రాహుల్ గాంధీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
Oct 12, 2026, 11:10 IST
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి ర్యాలీని అడ్డుకున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. భగవాన్ దాస్ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలు, కార్యకర్తలను నిలువరించారు. ఈ ర్యాలీలో పలువురు విపక్ష నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.