నల్లమాడ - Nallamaada

కామారెడ్డి జిల్లా
Top 10 viral news 🔥
నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు.. 17 జిల్లాలకు ‘రెడ్‌’ ఎలర్ట్‌
Sep 23, 2026, 00:09 IST/

నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు.. 17 జిల్లాలకు ‘రెడ్‌’ ఎలర్ట్‌

Sep 23, 2026, 00:09 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, కర్ణాటక-కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం 17 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గురువారం 8 జిల్లాలకు రెడ్‌, 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల 20.4 సెం.మీ.కుపైగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 25, 26 తేదీల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.