
గూగూడులో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు: నేడు పెద్దసరిగెత్తు వేడుక
నార్పల మండలం గూగూడులో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దసరిగెత్తు వేడుకను శుక్రవారం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి నుంచి ప్రధాన పీరుతో పాటు అన్ని పీర్ల ఊరేగింపు వైభవంగా సాగనుంది. శనివారం ఉదయం 5 గంటలకు స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేయనున్నారు. ఈ వేడుకలను చూసేందుకు, స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.












