
రైతుల సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో 'ఛలో విజయవాడ' పోస్టర్ విడుదల
పెద్దవడుగూరులోని యూనియన్ బ్యాంకు వద్ద సీపీఐ మండల కార్యదర్శి వెంకట రాముడు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


















