
గోరంట్ల: రైతుల సంఘీభావంతో VRAల దీక్షకు బలం
గోరంట్ల మండలంలో VRAల దీక్షా శిబిరానికి రైతులు సంఘీభావం తెలిపారు. VRAల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రైతులు కోరారు. తెలంగాణ తరహాలో వేతన స్కేల్ అమలు, అర్హులైన VRAలకు VROలుగా పదోన్నతులు, నామినీ VRAల నియామకాలు పూర్తి చేయాలని బుధవారం VRAలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, అధికారులతో చర్చలు జరిపి VRAల డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతు సోదరుల మద్దతుకు VRA సంఘం ధన్యవాదాలు తెలిపింది.
























