Sep 07, 2026, 16:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఆగ్రహం: రామారెడ్డిలో భారీ ధర్నా
Sep 07, 2026, 16:09 IST
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం రామారెడ్డి బస్టాండ్ ఆవరణలో భారీ ధర్నా నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ధర్నాలో రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాల రద్దు, రూ. 2500 మహాలక్ష్మి, రూ. 500 గ్యాస్, పెన్షన్ల పెంపు, రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు బకాయిలు వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అనంతరం తహసీల్దార్ ఉమాలతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, దశరథ్ రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్, మైపాల్, బండి శ్రీనివాస్, పెంటయ్య, వివిధ మండలాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.