Sep 29, 2026, 15:09 IST/
5 రోజుల పనిదినాల విధానంపై.. IBA హైలెవల్ కమిటీ
Sep 29, 2026, 15:09 IST
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన 'వారానికి 5 రోజుల బ్యాంకింగ్' విధానం అమలుతో పాటు ఇతర కీలక సర్వీస్ అంశాలపై ఈ కమిటీ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతినిధులతో చర్చించనుంది. ఈ కమిటీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో రజనీశ్ కర్నాటక్ ఛైర్మన్గా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అశోక్ చంద్ర ఆల్టర్నేట్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.