
సింగనమలలో పోలింగ్ కేంద్రాల జాబితాపై సమావేశం
సింగనమల మండల ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు పాల్గొన్నారు. ఎంపీడీవో భాస్కర్ తిరిగి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బుధవారం తోట ఓబులేసు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.




















