
అయాన్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
తాడిపత్రి శ్రీవాణి హై స్కూల్ లో జరిగిన జిల్లా స్థాయి SGF తైక్వాండో సెలెక్షన్ పోటీలలో అయాన్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. U-14 విభాగంలో నాగమోక్షిత, U-17 విభాగంలో జయవర్ధన్, హర్షవర్ధన్, U-19 విభాగంలో రోహిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కోచ్ వెంకటరమణ మాస్టర్, తైక్వాండో సాయి, క్రీడాకారుల తల్లిదండ్రులు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.




















