Sep 08, 2026, 13:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
రైతులకు ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్ల పంపిణీ
Sep 08, 2026, 13:09 IST
కామారెడ్డి జిల్లా తాండూర్ కిచ్చన్నపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎఫ్ పి ఓ లో మొదటి విడతగా సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను మంగళవారం పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి మాట్లాడుతూ, FPOలో 750 మంది రైతులకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉండగా, ఇప్పటివరకు 520 మంది సభ్యులుగా చేరారని, త్వరలో 750 మంది సభ్యుల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఈక్విటీ గ్రాంట్ సర్టిఫికెట్లను అందజేశారు.