
అదుపుతప్పి ఆటో బోల్తా.. ఒకరు మృతి
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారు గుంతకల్ రహదారిలో సోమవారం ఉదయం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలికి చెందిన ఆటో ఉరవకొండకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అదే గ్రామానికి చెందిన అంజనేయ (65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.






















