Sep 25, 2026, 09:09 IST/
సీఎం సొంత మండలంలో దళిత మహిళా సర్పంచ్కు అవమానం
Sep 25, 2026, 09:09 IST
TG: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల దళిత మహిళా సర్పంచ్ కాశమ్మను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దూషించారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని, బిల్లులు నిలిపివేసి సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే బెదిరించారని కాశమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలంలోనే ఎస్సీ మహిళా ప్రజాప్రతినిధికి ఈ పరిస్థితి ఎదురవడంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.