
భార్య చేతిలో భర్త దారుణ హత్య, పిల్లలు అనాథలు
యాడికి మండలం పెద్ద పేటలో శివప్రసాద్-హైమావతి దంపతుల మధ్య ఈ నెల 12న జరిగిన ఘర్షణలో, భార్య హైమావతి రోకలిబండతో కొట్టడంతో భర్త మృతి చెందాడు. ఈ ఘటనలో హైమావతిని 15న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. అనాథాశ్రమ నిర్వాహకుడు ప్రసాద్ వారిని చేరదీయగా, బుధవారం పలువురు దాతలు ఆశ్రమానికి వెళ్లి పిల్లలకు చేయూత అందించారు.













