గుంతకల్లు - Guntakal

పెద్దవడుగూరు మండల వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు

పెద్దవడుగూరు మండల వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు

పెద్దవడుగూరు మండల వ్యాప్తంగా దేవాలయాలు దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న చౌడేశ్వరి దేవి దేవాలయంలో ఈరోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు. చౌడేశ్వరిదేవి దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఒక్కోరోజు ఒక్కోరూపంలో దర్శనం ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు, భక్తిశ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని వారు కోరారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా