రాప్తాడు - Raptadu

దుర్గాష్టమి సందర్భంగా చౌడేశ్వరి దేవికి గ్రామోత్సవం

సి కె పల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా స్థానిక చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ కి వివిధ పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రామస్వామి గుడిలో అమ్మవారి కలశానికి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పురోహితుడు వేదమంత్రాలతో పూజ చేసి పూజారి తలపైన అమ్మవారిని ఎత్తుకొని గ్రామంలో ప్రధాన వీధుల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి స్తోత్రాలను పట్టిస్తూ ఉత్సవ విగ్రహాన్ని చౌడేశ్వరిదేవి ప్రధాన ఆలయానికి చేర్చారు. భక్తులు ఆలయంలో అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా
కాలేజీలో విషాదం: లైటింగ్ పోల్ పడి విద్యార్థిని మృతి
Oct 18, 2026, 07:10 IST/

కాలేజీలో విషాదం: లైటింగ్ పోల్ పడి విద్యార్థిని మృతి

Oct 18, 2026, 07:10 IST
హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకలు తీవ్ర విషాదానికి దారితీశాయి. ‘సంగమం 2026’ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్స్, అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులకు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సోనా అనే విద్యార్థిని మృతి చెందగా, ఆమె కవల సోదరితో పాటు మరో 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలకు మరియు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.