తాడిపత్రి - Tadipatri

వీడియోలు


కామారెడ్డి జిల్లా
అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
Oct 16, 2026, 08:10 IST/బాన్సువాడ
బాన్సువాడ

అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి

Oct 16, 2026, 08:10 IST
బోర్లం గ్రామంలోని మైనార్టీ స్మశాన వాటిక ముందు ఉన్న ఖాళీ స్థలంలో కేటాయించబోయే డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అక్రమాలకు తెరలేపుతున్నారని బోర్లం గ్రామ బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గురువారం బోర్లం గ్రామ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అత్యవసర సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నాయకుల పక్షపాత వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారు. మైనార్టీ స్మశాన వాటిక ముందున్న ఖాళీ స్థలంలో కేటాయించబోయే డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లను, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు తమ సొంత అనుచరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దక్కేలా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.