ఉరవకొండ - Uravakonda

ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ప్లేయర్ షాహీదా కు సన్మానం

ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ప్లేయర్ షాహీదా కు సన్మానం

ఆసియా టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన షేక్ షాహిదాను ఉరవకొండలో ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసిఫ్ అమ్మ, చిట్టమ్మల ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాహిదా ఆసియా టోర్నమెంట్‌కు వెళ్లేందుకు తమ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించామని, ఆమె విజయం సాధించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో షాహిదా మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనాలని తెలిపారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా
అన్ని కార్పొరేషన్లలో జి+5 ఇందిరమ్మ టవర్లు: మంత్రి పొంగులేటి
Nov 04, 2026, 11:11 IST/

అన్ని కార్పొరేషన్లలో జి+5 ఇందిరమ్మ టవర్లు: మంత్రి పొంగులేటి

Nov 04, 2026, 11:11 IST
TG: దీపావళి వేళ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కార్పొరేషన్ల పరిధిలో జి+5 ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. తొలి విడతలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ కార్పొరేషన్లలో ఈ నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి దీపావళి లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' అనే కాన్సెప్ట్‌తో లబ్ధిదారుల ఇళ్లల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు.