ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


టేకాఫ్‌కు ముందు ఆల్కహాల్ టెస్ట్.. ఎయిర్ఇండియా పైలట్ సస్పెన్షన్
Sep 25, 2026, 09:09 IST/

టేకాఫ్‌కు ముందు ఆల్కహాల్ టెస్ట్.. ఎయిర్ఇండియా పైలట్ సస్పెన్షన్

Sep 25, 2026, 09:09 IST
జ్యూరిచ్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌కు కొన్ని క్షణాల ముందు నిలిచిపోయింది. ఈ నెల 6న విమానం నడపాల్సిన పైలట్‌ ఆల్కహాల్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఫెయిల్ అయిన అతన్ని, రెండో పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తూనే, ఒక ప్రయాణికుడి రూపంలో భారత్‌కు పంపించారు. పైలట్‌ను ఎయిర్‌ ఇండియా సస్పెండ్‌ చేసింది. తుది మెడికల్‌ రిపోర్ట్‌, పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని సంస్థ తెలిపింది.