
జగన్ను క్రిస్టియన్గానే చూస్తున్న విజయసాయిరెడ్డి: విజయసాయిరెడ్డి
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు సామాజిక వర్గాల చేతుల్లోనే అధికారం ఉందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమ్మ, క్రిస్టియన్ సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని, వైఎస్ జగన్ను తాను క్రిస్టియన్గానే చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాపు, బీసీ, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నాయకత్వ లేదా సీఎం అయ్యే అవకాశం లేదా అని ఆయన ప్రశ్నించారు.




