
బద్వేల్లో నారాయణ యాదవ్‌కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ
రేగలగడ్డ నారాయణ యాదవ్ బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా ఆదివారం బద్వేల్లో బిసివై పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మార్కెట్‌యార్డు వద్ద గల రామాలయం నుంచి బైపాస్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ తనకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




































