
బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
మణిపూర్ ఇంఫాల్లోని బీఎస్ఎఫ్ క్యాంపులో గురువారం ఉదయం ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం 75 మంది జవాన్లు, ముగ్గురు పౌరులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి లక్షణాలతో బాధపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆహార పదార్థాలపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.




