
ఓటమి భయంతోనే కూటమి నేతల దౌర్జన్యాలు: క్రిష్ణారెడ్డి
వైఎస్సార్ కడప, కమలాపురం ప్రాంతాల్లో సోమవారం స్థానిక ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య విలువలను విస్మరించి, ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటమి భయంతో కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ, వైఎస్సార్సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ కడప జిల్లా వాలంటరీ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ క్రిష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






















